Pithapuram : పిఠాపురంలో ఎమ్మెల్యే బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి

Pithapuram
Pithapuram : ఏడిద భాస్కర్ రావు అనే చెప్పులు కుట్టే వ్యక్తి పిఠాపురంలో ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నారు. ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇంటర్మీడియేట్ వరకు చదివిన భాస్కర్ రావు స్థానిక ప్రభుత్వ కాలేజీ వద్ద చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయన చెప్పులు కుడుతూనే ఎంఏ రాజనీతి శాస్త్రం పూర్తి చేశారు. నియోజక వర్గ సమస్యలకు తగిన పరిష్కారాలతో ఆయన ఓ మేనిఫెస్టో తయారుచేసుకున్నారు.
భాస్కర్ రావు అభ్యర్థిత్వాన్ని పది మంది బలపరిచారు. ఆయన వద్ద రూ. 20 వేల నగదు మాత్రమే ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. అయితే పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
 TAGS  AP Elections 2024cobblerCobbler-pithapuramMLA independent candidatePithapuramPithapuram MLA Candidate
