NDA Alliance Manifesto : ఏపీలో ఎన్డీయే కూటమి మేనిఫెస్టో..

NDA Alliance Manifesto
NDA Alliance Manifesto : ఏపీలో ఎన్డీయే కూటమి మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు దీన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జ్ సిద్ధార్థ సింగ్, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, మూడు వంటగ్యాస్ సిలిండర్లు వంటి కీలక హామీలు ఉన్నాయి. ఆడబిడ్డ పథకం కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలలవారీ రూ. 1,500 పింఛను, యువతకు ప్రతినెలా రూ. 3,000 నిరుద్యోగ భృతి, ప్రత్యేక నీటి పైపు కనెక్షన్ తో పాటు ప్రతి ఇంటికి తాగునీరు వంటి వాగ్దానాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం రైతులకు పెట్టుబడిగా రూ. 20,000, తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకు ప్రతి సంవత్సరం రూ.15,000 అందజేస్తామని పేర్కొన్నారు.
 TAGS  AP Elections 2024ChandrababuNDA Alliance ManifestoPawan KalyanSiddhartha SinghTDP Janasena BJP Joint manifestoUndavalli
