CM Revanth : సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు

CM Revanth
CM Revanth : సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)ను బీఆర్ఎస్ నేతలు కోరారు. ఈ మేరకు వారు బుధవారం ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ఆరెపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉస్మానియా పవర్ కట్ ఘటనను ఉదహరిస్తు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ తదితరులు బుధవారం ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ను కలిసి సీఎంపై ఫిర్యాదు చేశారు. 2023 మే 12న నకిలీ నోటీసును గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని, యూనివర్సిటీ హాస్టళ్ల మూసివేత, మెస్ సౌకర్యాలపై తప్పుడు సమాచారం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
 TAGS  BRSBRS Complaint on RevanthBRS Vs CongressCM RevanthCongressElection CommissionOsmania Power cuttelangana
