Avinash Reddy : వివేకా హత్య కేసులో.. సీబీఐ కోర్టుకు హాజరైన అవినాష్ రెడ్డి

Avinash Reddy
Avinash Reddy : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు రాజకీయంగా పెను దుమారం రేపింది. ఈ కేసు విషయంలో జగన్ సోదరి షర్మిల, వివేకా కూతురు సునీతలు జగన్, అవినాష్ రెడ్డిలపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కేసు విషయంలో సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. బెయిల్ పై ఉన్న నిందితులు భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలతో కలిసి అవినాష్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు.
చంచల్ గూడా జైలులో ఉన్న నలుగురు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ఎదుట హారుపరిచారు. అయితే, తదుపరి విచారణను జూన్ 11కు వాయిదా వేస్తూ సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది.
 TAGS  AP Elections 2024Avinash ReddyAvinash Reddy-CBI CourtCBI CourtViveka Murder Caseys sharmilaYS Sunitha
