Proddatur : ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. పోలీసుల దర్యాప్తు

Proddatur Pension Money
Proddatur : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఏడో వార్డు సచివాలయం పరిధిలో పింఛను డబ్బు మాయమైంది. కొంతమంది దుండగులు తన వద్ద ఉన్న డబ్బు దోచుకు పోయారని సచివాలయ కార్యదర్శి మురళి తెలిపారు. సోమవారం ఉదయం పింఛను డబ్బు పంపిణీ చేసేందుకు వెళ్తుండగా స్పృహ తప్పి బైక్ పై నుంచి కింద పడిపోయానని.. ఈ క్రమంలో తన వద్ద ఉన్న రూ.4 లక్షలను దుండగులు ఎత్తుకెళ్లారని చెప్తున్నారు.
కార్యదర్శి మురళిని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పింఛను డబ్బు మాయం కావడంపై పోలీసులు, పురపాలక అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన జరగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
 TAGS  AP Pension distributionPension MoneyPolice InvestigationProddaturProddatur Pension MoneyYSR district
