Cow On Bike Viral : బైక్ పై ఆవును ఎలా తీసుకెళ్తున్నాడో ఓ లుక్కేయండి.. వైరల్ వీడియో

Cow On Bike Viral
Cow On Bike Viral : లోకంలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. మనం వాటిని పట్టించుకుంటాం. కాసేపు ఆగి చూస్తాం. పుర్రెకో గుణం.. జిహ్వకో రుచి అంటారు. ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు. ఆంగ్లలో ఓ సామెత ఉంది. many heads mini minds ఎన్నో తలలు మరెన్నో తలంపులు. మనిషి ఆలోచనలు అపరిమితంగా ఉంటాయి. అనంతంగా వస్తాయి. ఒకరికి వచ్చిన ఆలోచన మరొకరికి రాదు. అలా మన ఆలోచనలకు కార్యరూపం ఇస్తే అద్భుతాలు జరుగుతుంటాయి.
అలాంటి అద్భుతమే ఇక్కడ జరిగింది. మనం సాధారణంగా ద్విచక్ర వాహనం మీద మనుషులు, జంతువులు, ఇతర సామగ్రి తీసుకెళ్లడం మామూలే. కానీ అతడు ఓ అద్భుతం చేశాడు. ఏకంగా తన బైక్ పై ఆవును కూర్చోబెట్టుకుని దర్జాగా స్పీడ్ లో వెళ్లడం కంట కనిపించింది. దీంతో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆవును బైక్ మీద కూర్చోబెట్టుకోవడం ఎలా అని ఆలోచనలో పడిపోయారు.
దానికి ఆవు కూడా ముద్దుగా కూర్చుంది. ఎటు కదలకుండా అలాగే ఉంది. కుక్కలు, మేకలు, పిల్లులు లాంటివి తీసుకెళ్లడం చూశాం కానీ ఆవును బండి మీద కూర్చోబెట్టుకుని అతడు సాహసమే చేశాడు. అంత పెద్ద ఆకారాన్ని వాహనంపై తీసుకెళ్లడం సాహసమే అని చెప్పాలి. అతడు ఆవును అలా తీసుకెళ్లడం అందరిని షాక్ కు గురి చేసింది. కలియుగంలో జరిగే వింతల్లో ఇది ఒకటి.
అది పొరపాటున ఎటైనా కదిలినా లేక దూకినా అతడి ప్రాణాలే పోతాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా థేచ్ఛగా భయంగా కాకుండా స్పీడ్ గా తీసుకెళ్లడం సంచలనం కలిగిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేలాది లైకులు లక్షలాది షేర్లు వస్తున్నాయి. దీంతో ఆవు బైక్ ఎక్కడం వింతగా చూస్తున్నారు. వీడియోపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
