Bomb threats : 70కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు

Bomb threats
Bomb threats : విమానాలకు నేడు భారీ సంఖ్యలో బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు కేంద్రం హెచ్చరికలు చేస్తున్నప్పటికీ, తాజాగా పదుల సంఖ్యలో విమానాలకు ఈ నకిలీ బెదిరింపులు రావడం ఆందోళన రేకెత్తిస్తోంది. గురువారం ఒక్కరోజో 70కి పైగా విమానాలకు ఈ పరిస్థితి ఎదురైనట్లు సమాచారం. వాటిలో ఎయిరిండియా, విస్తారా, ఇండిగో, ఆకాశ ఎయిర్ విమానాలున్నాయి. మొత్తంగా 11 రోజుల వ్యవధిలో 250 ఫ్లైట్లకు ఈ బెదిరింపులు వచ్చాయి.
ఆకాశ ఎయిర్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. అక్టోబరు 24న తమ సంస్థకు చెందిన కొన్ని విమానాలకు భద్రతాపరమైన అలర్ట్స్ వచ్చినట్లు తెలిపారు. ‘‘మా అత్యవసర ప్రతిస్పందన బృందాలు వాటిని పరిశీలిస్తున్నాయి. భద్రత, నియంత్రణ సంస్థల అధికారులతో టచ్ లో ఉన్నాం. భద్రతాపరమైన నియమావళిని పాటిస్తున్నాం’’ అని తెలిపారు.