Hostel students :హైవేపై హాస్టల్ విద్యార్థుల ధర్నా.. భారీగా ట్రాఫిక్ జాం

Hostel students
Hostel students : అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో బాలికల కళాశాల వసతి గృహం విద్యార్థులు రోడ్డుపై ధర్నాకు దిగారు. హాస్టల్ లో భోజనం బాగోలేదంటూ పాత హైవేపై వంటావార్పు చేసి నిరసన తెలిపారు. విద్యార్థుల ఆందోళనతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సుమారు కిలోమీటర్ వరకు అర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు.