Mahanandi temple : మహానంది ఆలయానికి భారీ విరాళం.. అందజేసిన రిటైర్డు లెక్చరర్

Mahanandi temple
Mahanandi temple : మహానంది ఆలయానికి భారీ విరాళం వచ్చింది. ఓ రిటైర్డు లెక్చరర్ భారీ విరాళం అందజేశారు. మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన రాజు, శకుంతల అనే దంపతులు మహానంది ఆలయానికి రూ.2 కోట్లకు పైగా విలువైన ఆస్తులను విరాళంగా అందజేశారు. ఆలయానికి 2.10 ఎకరాల భూమిని, ఐదు సెంట్లలో కట్టిన ఇంటిని కూడా రాజు దంపతులు విరాళంగా అందజేశారు. గురువారం దేవస్థానం ఈవో చేతికి ఈ ఆస్తులకు సంబంధించిన పత్రాలను దంపతులు ఇద్దరూ అందజేశారు. మహానంది ఆలయం అభివృద్ధి కోసం రాజు గతంలోనూ విరాళాలు అందించారు.
ఈ నేపథ్యంలో రాజు దానగుణాన్ని భక్తులు అభినందిస్తున్నారు. మరోవైపు ఆలయ అధికారులు కూడా రాజు కుటుంబానికి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు, స్వామి దర్శనం చేయించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందించగా.. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.