Shobhan Babu : శోభన్ బాబు మనవడు అద్భుతం చేశాడు

Shobhan Babu : తెలుగు చలనచిత్ర సీమలో అద్భుత నటనతో వెలుగొందిన శోభన్ బాబు కుటుంబం నుంచి ఎవరూ సినీ రంగంలోకి రాకుండా ఉంటే, ఆయన మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన మాత్రం వైద్యరంగంలో సూపర్ స్టార్‌గా ఎదిగాడు. సీనియర్ గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్న సురక్షిత్ తాజాగా తన ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించి వార్తల్లో నిలిచాడు. చెన్నైలో 44 ఏళ్ల మహిళకు 4.5 కిలోల గర్భాశయాన్ని ట్రూ 3డీ ల్యాపరోస్కోపిక్‌ ద్వారా తొలగించడం ద్వారా, తన గురువు డాక్టర్ సిన్హా చేసిన 4.1 కిలోల గర్భాశయ తొలగింపు రికార్డును బద్దలు కొట్టాడు. ఈ అరుదైన శస్త్రచికిత్సతో అతనికి దేశవ్యాప్తంగా నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

2016లో చెన్నై అన్నా నగర్‌లో ‘ఇండిగో ఉమెన్స్ సెంటర్’ను స్థాపించిన సురక్షిత్, 10,000కిపైగా శస్త్రచికిత్సలు చేసి ఇప్పటికే 40కి పైగా అవార్డులు, రివార్డులు పొందాడు. అంతేకాకుండా మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, తాత శోభన్ బాబు పేరు మీద ప్రత్యేక వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నాడు. మొత్తం చెప్పాలంటే, రీల్ హీరో శోభన్ బాబు మనవడు రియల్ హీరోగా ఎన్నో ప్రాణాలు రక్షిస్తూ, మాతృత్వాన్ని అందిస్తూ వెలుగులోకి వచ్చాడు.

TAGS