Bala Krishna : జవాన్ కుటుంబానికి అండగా బాల కృష్ణ ఒక నెల ఎమ్మెల్యే జీతo

Bala Krishna : జమ్మూకశ్మీర్‌లో ఎల్ఓసీ వద్ద పాకిస్థాన్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఏపీ జవాన్ మురళీ నాయక్‌కు ఘన నివాళులు అర్పిస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన మురళీ, దేశ రక్షణలో ప్రాణత్యాగం చేశారు. మే 11న ఆయన అంత్యక్రియలు స్వగ్రామంలో జరిగాయి. స్టార్ హీరో కం, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం మురళీ నాయక్ కుటుంబానికి అండగా నిలిచారు. ఒక నెల ఎమ్మెల్యేగా పొందే జీతాన్ని ఆర్థిక సాయంగా అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మే 12న బాలకృష్ణ, మురళీ నాయక్ స్వగ్రామం కల్లితండా వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి ఈ సాయాన్ని అందించనున్నారు.

TAGS