ISRO : దేశ భద్రతకు 10 ఉపగ్రహాలు.. ఇస్రో సంచలనం
ISRO : ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ ప్రకారం, భారతదేశ భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు 10 ఉపగ్రహాలు నిరంతరంగా పనిచేస్తున్నాయి. ఇంఫాల్‌లోని సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. పాకిస్థాన్, చైనా వంటి పొరుగుదేశాల వక్రప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని, దేశ వ్యూహాత్మక రక్షణ అవసరాల కోసం శాటిలైట్, డ్రోన్ సాంకేతికతల వినియోగం తప్పనిసరిగా మారిందని ఆయన వివరించారు.భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతుండగా, గత కొద్ది రోజులుగా సరిహద్దుల్లో కాల్పులు, దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 22న పాక్‌కి చెందిన ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై దాడులు జరపగా, భారత్ “ఆపరేషన్ సిందూర్” పేరిట ప్రతిదాడి చేపట్టి పీవోకేలోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. పాక్ దాడులను భారత త్రివిధ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి.
ఈ నేపథ్యంలో పాక్ ఎఫ్-16 ఫైటర్లతో పాటు, డ్రోన్‌లు, వైమానిక స్థావరాలు నాశనం చేయబడటంతో భారీ నష్టం జరిగింది. చివరకు పాక్ దిగివచ్చి కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది. ఇస్రో ఉపగ్రహాల పర్యవేక్షణతో పాటు, భారత భద్రతా