Ram Charan : లండన్‌లో రామ్ చరణ్ అభిమానుల గొప్పమనసు: జాతీయ రక్షణ నిధికి భారీ విరాళం

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల లండన్ పర్యటనలో ఉన్న సందర్భంగా, యూకేలోని యునైటెడ్ జనసేన – యూకే రామ్ చరణ్ అభిమానులు కలిసి గొప్ప మనసు చాటుకున్నారు. దేశ సేవలో ఉన్న సైనికులకు అండగా నిలబడటం కోసం వారు జాతీయ రక్షణ నిధికి భారీ విరాళం అందించారు.

తాజాగా లండన్‌లో రామ్ చరణ్ పాల్గొన్న అభిమానుల సమావేశంలో, యునైటెడ్ జనసేన యూకే విభాగం తరపున లక్ష రూపాయలు, యూకే రామ్ చరణ్ అభిమానుల తరపున లక్ష రూపాయలు, మొత్తం కలిపి రెండు లక్షల రూపాయల చెక్కులను రామ్ చరణ్‌కు అందజేశారు. ఈ విరాళాలను ఆయన ద్వారా జాతీయ రక్షణ నిధికి పంపనున్నారు.

ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ, దేశ రక్షణలో ప్రాణాలను పణంగా పెడుతున్న సైనికులకు తమ వంతు సహాయం అందించడం గర్వంగా ఉందని తెలిపారు. రామ్ చరణ్ తమ విరాళాన్ని స్వీకరించి, ఈ మంచి పనికి తమను ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

రామ్ చరణ్ తన మైనపు విగ్రహావిష్కరణ, ఆర్‌ఆర్‌ఆర్ లైవ్ ఆర్కెస్ట్రా ఈవెంట్ కోసం ఇటీవల లండన్ వెళ్లారు. ఈ పర్యటనలో అభిమానులతో ముచ్చటించేందుకు కూడా ఆయన సమయం కేటాయించారు. ఇలాంటి అభిమానులు ఉండటం తన అదృష్టమని రామ్ చరణ్ పేర్కొన్నారు. అభిమానుల ఈ సేవా కార్యక్రమం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

TAGS