Mirai : ‘మిరాయ్’ టీజర్ మైండ్ బ్లోయింగ్..మరోసారి చరిత్ర సృష్టించబోతున్న తేజ సజ్జ!
Mirai Teaser : తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ‘మిరాయ్’ టీజర్ ప్రేక్షకులను అబ్బురపరిచింది. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పవర్ఫుల్ డైలాగ్స్ అన్నీ కలసి ఓ హై టెక్నికల్ మాయానాటకంలా కనిపించాయి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ‘హనుమాన్’ తర్వాత తేజ సజ్జ కెరీర్లో మరో భారీ అడుగుగా భావిస్తున్నారు. టీజర్ లో మనోజ్ విలన్ గా కనిపించిన విధానం, ఆయన డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను రిఫ్రెష్ చేసింది. మిడియం బడ్జెట్ లో ఇలా గ్రాండ్ విజువల్స్ అందించగలగటం చిత్రబృంద నైపుణ్యాన్ని చాటుతోంది. సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానున్న ‘మిరాయ్’ మరోసారి చరిత్ర సృష్టించే అవకాశం ఉందన్న అంచనాలు పెరుగుతున్నాయి.