Jabardast Avinash : జబర్దస్త్ అవినాష్ బిడ్డ దుర్మరణం..కన్నీళ్లు రప్పిస్తున్న లేటెస్ట్ పోస్ట్!

Jabardast Avinash child tragic death
Jabardast Avinash : ఈటీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించి ఆ తర్వాత బిగ్ బాస్ షో లోకి అడుగుపెట్టి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కమెడియన్స్ లో ఒకరు ముక్కు అవినాష్. స్టార్ మా ఛానల్ లో ప్రస్తుతం ప్రసారం అవుతున్న అత్యధిక ఎంటర్టైన్మెంట్ షోస్ లోఅవినాష్ హవానే నడుస్తుంది. అలాగే ఈమధ్య కాలం లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా బాగా కనిపిస్తున్నాడు.
రీసెంట్ గానే వెంకటేష్ 75 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఏర్పాటు చేసిన ఒక స్పెషల్ ఈవెంట్ ముక్కు అవినాష్ సందడి చేసాడు. ఆయన అందించిన ఎంటర్టైన్మెంట్ ఈ ఈవెంట్ కి పెద్ద హైలైట్ అయ్యింది. అలాగే అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో కమెడియన్ గా కనిపిస్తూ ఉంటాడు. ఒకానొక దశలో అప్పులతో ఆత్మహత్య చేసుకునే స్థాయి నుండి, నేడు లక్షలు సంపాదించే కమెడియన్ గా ఎదిగాడు.
ఎల్లప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే అవినాష్, నేడు తన ఇంస్టాగ్రామ్ లో బాధ పడుతూ పెట్టిన ఒక విచారకరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ మారింది. అదేమిటంటే ‘నా జీవితంలో సంతోషం వచ్చినా, బాధ వచ్చిన, నా కుటుంబం లాంటి మీతోనే పంచుకుంటూ వచ్చాను. ఇప్పటి వరకు నా జీవితం లో జరిగిన ప్రతీ ఆనందకరమైన విషయాన్నీ మీతో పంచుకున్నాను. కానీ మొదటిసారి నా జీవితం లో జరిగిన విషాదకరమైన సంఘటనని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను, నా భార్య అనూజ తల్లితండ్రులం అవ్వాలని ఎన్నో కలలు కన్నాము. ఆ రోజు కోసం ప్రతీ రోజు ఎదురు చూస్తూ వచ్చాము. కానీ మా దురదృష్టం కొద్దీ మా బిడ్డని కోల్పోయాము. ఇది మేమిద్దరం జీర్ణించుకోలేని విషయం. అభిమానులైన మీకు ఎప్పటికైనా ఈ నిజాన్ని చెప్పాలి కాబట్టి, ఈరోజు నేను ఈ విషయాన్నీ చెప్తున్నాను. ఇప్పటి వరకు మీరు మాపై చూపించిన ప్రేమకు మేము ధన్యులం. ఇక నుండి కూడా మా పై ఇలాగే ప్రేమ కురిపించాలని ఆశిస్తున్నాము. దయచేసి ఇక ఎప్పుడూ కూడా ఈ విషయం గురించి ప్రస్తావించి మమల్ని బాధ పెట్టొద్దు’ అంటూ అవినాష్ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ఇకపోతే అవినాష్ కి ధైర్యం చెప్తూ అతని తోటి జబర్దస్త్ కమెడియన్స్ మరియు పలువురు సినీ నటులు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసారు.