Acharya : మరోసారి అభిమానులను భయపెట్టేందుకు వస్తున్న ‘ఆచార్య’..పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే!

Acharya

Acharya

Acharya : మెగా ఫ్యాన్స్ జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేని చెడు జ్ఞాపకం ‘ఆచార్య’. వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్న కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2022 వ సంవత్సరం ఏప్రిల్ 29 వ తారీఖున విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే అభిమానులు ఏ రేంజ్ అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ అంచనాలను కనీసం ఒక్క శాతం కూడా అందుకోలేకపోయింది ఈ కళాఖండం.

ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీ లో డబ్ చేసి పెన్ స్టూడియోస్ వారు సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారట. పెన్ స్టూడియోస్ బ్యానర్ అధినేత కి డబ్బులు ఎక్కువ ఉన్నాయా?, తెలుగు లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిల్చిన ఈ సినిమాని ఇప్పుడు హిందీ లో విడుదల చేయడమా?, మతి భ్రమించిందా అని సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.