Pavitra-Naresh : కోరుకున్నంత సుఖం ఇవ్వలేదు.. అందుకే వద్దనుకున్నా.. పవిత్రతో జీవితం ఎలా ఉందంటే.. కుండబద్దలు కొట్టిన నరేష్..

Pavitra-Naresh
Pavitra-Naresh : నరేశ్-పవిత్ర లోకేశ్ వ్యవహారం ఇండస్ట్రీని ఏ మేరకు కుదిపేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ఇద్దరికి కూడా వేరు వేరు వ్యక్తులతో వివాహం జరిగి పిల్లలు కూడా ఉండడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ కు గురయ్యారు. అయితే వీరికి కొందరు మద్దతు ఇచ్చిన వారు కూడా ఉన్నారు. ఇందులో నరేశ్ కు నాలుగో తోడుగా పవిత్ర రాగా.. పవిత్రకు మాత్రం రెండో తోడుగా నరేశ్ వచ్చాడు. వీరి వ్యవహారాన్ని కొన్ని రోజులుగా పరిశీలించిన నరేశ్ మూడో భార్య రమ్యా రఘుపతి నరేశ్-పవిత్ర లోకేశ్ ను ఒక హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
ఇక అప్పటి నుంచి వీరి వ్యవహారం ఇండస్ట్రీని కూడా కుదిపేసింది. నరేశ్ ను పెళ్లి చేసుకోనిచ్చేది లేదని రమ్య రఘుపతి ఇంటర్వ్యూలు ఇవ్వడం.. రమ్యను విడిచిపెట్టినట్లు నరేశ్ ఇంటర్వ్యూలు ఇవ్వడం, పవిత్ర క్యారెక్టర్ పై విమర్శలు ఇవన్నీ కలిపి పెద్ద దుమారమే లేపాయి. నరేశ్-పవిత్ర లోకేశ్ ‘మళ్లీ పెళ్లి’ కూడా తీశారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో సద్దుమణిగింది. ప్రశాంతంగా ఉన్న వేళ నరేశ్ మరో ఇంటర్వ్యూలో మాట్లాడి సంచలనం సృష్టించాడు.
నరేష్ ఒక ఇంటర్వ్యూకు హాజరై.. పవిత్రతో తన రిలేషన్‌పై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘ఒకరు మంచి, మరొకరు చెడు అని చెప్పలేను. ప్రపంచంలో చాలా మంది భార్య, భర్తలు డైవర్స్ తీసుకుంటున్నారు. నేను 3 పెళ్లిళ్లు చేసుకున్నా. కానీ ఏ భార్యతో సంతోషంగా లేను. అందుకే నాలుగో పెళ్లికి వెళ్దామని అనుకున్నా. 40 ఏళ్ల తర్వాత ఓ తోడు కావాలి.. ఈ ఏజ్ లో సింగిల్ గా బతకడం కష్టం. కాబట్టి నాలా ఆలోచించే కరెక్ట్ పార్ట్నర్ ను ఎంచుకున్నా. పవిత్రతో లైఫ్ చాలా బాగుంది. ఇకపై ప్రశాంతంగా ఉండాలని భావిస్తున్నా. ఎవరు ఏం అనుకున్నా.. ఐ డోంట్ కేర్’ అంటూ నరేష్ చెప్పారు. ముగ్గురి భార్యల వద్ద దొరకని సుఖం పవిత్ర దగ్గర దొరుకుందా? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.