Shivani Nagaram : ఈ తెలుగు యంగ్ బ్యూటీ ‘బేబీ’ని రిపీట్ చేస్తుందా?

Ambajipeta Marriage Band heroine
Shivani Nagaram : బొంబాయ్, బెంగళూర్ నుంచి తారలను దిగుమతి చేసుకునే రోజులు పోయినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో వారి సత్తా చాటతూ ఎవరికంటే తీసిపోమని నిరూపిస్తున్నారు. తెలుగు మూలాలు ఉన్న వారు సైతం స్టార్ హీరోయిన్స్ కు సాటిగా నటిస్తూ మెప్పిస్తున్నారు. తెలుగు అమ్మాయిలు ఇప్పుడు తమ సత్తాను మరింతగా నిరూపించుకుంటున్నారు. ఇటీవల ‘బేబీ’ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చింది వైష్ణవి చైతన్య. ఈ సినిమాలో తన నటన, బోల్డ్ నెస్ ఆమెను ఏ మేరకు తీసుకెళ్లిందో చూశాం.
ఫస్ట్ సినిమా విడుదలకు ముందే యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఆ యంగ్ తెలుగు హీరోయిన్ సరసన ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ ఫేమ్ శివానీ నాగరం ఇప్పుడు నిలిచింది. సినిమా ప్రారంభానికి ముందు హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర కోసం ఆడిషన్స్ జరిగాయి. అయితే ఆ పాత్ర వచ్చిన శివానీ ఏకంగా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. సుహాస్ నటించిన ఈ చిత్రంలోని ‘గుమ్మా’ పాట ఆమెను సోషల్ మీడియా సెన్సేషన్ చేసింది. సినిమాలోని కొన్ని కీలకమైన ప్రీ క్లైమాక్స్ సన్నివేశాల్లో ఈ యంగ్ బ్యూటీ అద్భుతంగా నటించిందని తెలుస్తోంది. ఆ సీన్స్ పై క్లిక్ చేసి ఆమె నటనా చాతుర్యం ఆకట్టుకుంటే ఆమె ఇక్కడ మరో ‘బేబీ’ తరహా నటి అవుతుందని చిత్రబృందం భావిస్తోంది.
మరోవైపు నూతన దర్శకుడు దుష్యంత్ దర్శకత్వంలో ‘బేబీ’ సహ నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఒక రోజు ముందుగానే ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు.