Earthquake : రాష్ట్రంలో భూకంపం

Earthquake : తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. కరీంనగర్, జగిత్యాల్, వేములవాడ, సిరిసిల్ల, నిర్మల్, పెద్దపల్లి తదితర జిల్లాల్లోని కొన్ని మండలాల్లో సా.6.50 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైనట్లు సమాచారం. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గతంలోనూ పలుమార్లు ఇలా కంపించిన విషయం తెలిసిందే

TAGS