Corona : దేశాన్ని మళ్లీ భయపెడుతున్న కరోనా.. కొత్తగా 257 కేసులు

Corona : భారతదేశంలో కరోనావైరస్ కేసులు మరోసారి వార్తల్లో నిలిచాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా కొత్తగా 257 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, భారతదేశంలో నమోదైన ఈ కొత్త కేసులు కొంతమందిలో ఆందోళన కలిగిస్తున్నాయి. అయినప్పటికీ, కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

TAGS