Allu Aravind : అల్లు అరవింద్ నుండి ఇండియన్ ఆర్మీకి గౌరవాన్నిచ్చే గొప్ప చర్య!

Allu Aravind : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన తాజా చిత్రం సింగిల్ ద్వారా సాధించిన లాభాల్లో కొంత భాగాన్ని ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం దేశానికి ఎదురవుతున్న ప్రమాదకర పరిస్థితుల్లో సరిహద్దుల్లో జవాన్లు చేస్తున్న త్యాగాన్ని గమనించి, ఆయన చేసిన ఈ నిర్ణయానికి నెటిజెన్స్ సెల్యూట్ చేస్తున్నారు. ఇది పెద్ద మొత్తమై ఉండకపోయినా, ఆర్మీకి చూపుతున్న గౌరవం, కృతజ్ఞత భావం అభినందనీయం. ఇతరులూ అల్లు అరవింద్ ని ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.

TAGS