Dream11 : చిన్న ఊరిలో యువకుడు పెద్ద కల నిజం చేసుకున్నాడు. కౌశాంబి జిల్లా నుంచి వచ్చిన ఒక యువకుడు డ్రీమ్11 ఫాంటసీ క్రికెట్‌లో కేవలం ₹39 పెట్టుబడితో ₹4 కోట్లు గెలుచుకుని వార్తల్లోకి ఎక్కాడు.యువకుడు తన మొబైల్‌లో డ్రీమ్11 యాప్‌లో టీమ్ వేసి ఒక మ్యాచ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. మ్యాచ్‌లో తన జట్టు అద్భుతంగా ఆడటంతో, చివరికి ₹4 కోట్లు జేబులో పడేశాడు. ఈ విజయం యువకుడిని కుటుంబానికి మాత్రమే కాకుండా మొత్తం ఊరికి గర్వకారణంగా మార్చింది.
ఇప్పటికే స్థానికంగా అతడిని అభినందించే వారీతో ఇల్లు కోలాహలంగా మారిందని తెలిసింది. “చిన్న ప్రయత్నం కూడా గొప్ప ఫలితం ఇస్తుంది” అని ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే, ఆన్‌లైన్ గేమ్స్ ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, పక్కా సమాచారంతో మాత్రమే ఆడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.