Aadhaar : ఆధార్, పాన్, రేషన్ పౌరసత్వ రుజువులు కావు : ప్రభుత్వం సంచలన ప్రకటన
Aadhaar : భారత ప్రభుత్వం తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు వంటి పత్రాలు పౌరసత్వానికి చెల్లుబాటు అయ్యే రుజువులు కావని స్పష్టం చేసింది. పౌరసత్వాన్ని అధికారికంగా నిరూపించడానికి జనన ధృవీకరణ పత్రం (Birth Certificate) , నివాస ధృవీకరణ పత్రం (Domicile Certificate) మాత్రమే గుర్తింపు పొందినవి అని ప్రభుత్వం తెలిపింది.
ఇంతవరకు ఆధార్ లేదా పాన్ ఉన్నవారికి పౌరసత్వం నిర్ధారణలో ఈ పత్రాలు ఉపయోగపడతాయని కొందరు భావించేవారు. అయితే, ఆధార్, పాన్ వంటి పత్రాలు వ్యక్తి గుర్తింపు కోసం మాత్రమే ఉపయోగపడతాయని, పౌరసత్వ నిర్ధారణకు ఇవి సరిపోవని ప్రభుత్వం కొట్టిపారేసింది.