
Achampeta YCP Family’s Join to TDP
Achampeta News : వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఈరోజు మండల కేంద్రం అచ్చంపేటలో వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ టీడీపీలోకి వస్తున్న వలసలే రానున్న ఎన్నికల్లో గెలుపును సూచిస్తుందని తెలిపారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని, ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని భాష్యం ప్రవీణ్ కోరారు. అచ్చంపేట టీడీపీ నాయకులు ఆయనను పూలమాలలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అచ్చంపేట గ్రామస్థులు, మైనార్టీ సోదర సోదరీమణులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.