JAISW News Telugu

Aghori : అఘోరీ మగాడేరా బుజ్జి..!

Aghori : తాజాగా అఘోరీ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలను పేర్కొన్నారు.. పోలీసులు. తన పురుషాంగాన్ని శివుడికి అర్పించానంటూ గతంలో అఘోరీ చెప్పినా… రిమాండ్ రిపోర్ట్‌లో అసలు విషయం బయటపడింది. దొంగతనం చేసినందుకు శ్రీనివాస్ పురుషాంగాన్ని గ్రామస్తులు కాల్చారంటూ పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. చిన్నప్పుడు శ్రీనివాస్ తరచూ దొంగతనాలు చేసేవాడని, వాటికి గ్రామస్తులు శిక్షలు వేసేవారని చెప్పారు. ఓసారి వేసిన శిక్షలో శ్రీనివాస్ జననేంద్రియాలు కాలిపోయాయని, తీవ్ర ఇన్ఫెక్షన్ రావడంతో పురుషాంగంలో కొంతభాగాన్ని డాక్టర్లు తొలగించారని వెల్లడించారు. దాంతో… 2023లో చెన్నై వెళ్లి పురుషాంగాన్ని పూర్తిగా తొలగించుకున్న శ్రీనివాస్, 2024లో ఇండోర్‌కు వెళ్లి వృషణాలు కూడా తొలగించుకున్నాడు.

అఘోరీలా మారితే త్వరగా పాపులర్ కావచ్చని భావించిన శ్రీనివాస్‌… స్త్రీ లక్షణాలు వచ్చే హార్మోన్ థెరపీ కూడా తీసుకున్నాడని పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో వెల్లడించారు. జుట్టు పెంచుకుని అఘోరీలా మారిన శ్రీనివాస్‌.. భక్తుల నుంచి డబ్బులు, కానుకలు డిమాండ్ చేశాడని, ఇవ్వకపోతే తాంత్రిక శక్తులతో అంతం చేస్తానని బెదిరించే వాడని పోలీసులు చెప్పారు. అఘోరీ స్వతహాగా ట్రాన్‌జెండర్ కాదని కూడా రిమాండ్ రిపోర్ట్ తేల్చిసింది. అఘోరీలా జనాన్ని ఆకర్షించడం కోసమే శ్రీనివాస్‌ సర్జరీలు చేయించుకున్నాడని పోలీసులు బయటపెట్టారు.

Exit mobile version