Allu Arjun : బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ భారీగా ప్లాన్ చేస్తున్న తన డ్రీం ప్రాజెక్ట్ ‘మహాభారతం’ వార్తల్లోకెక్కింది. ఇందులో అర్జునుడిగా అల్లు అర్జున్, కర్ణుడిగా రామ్ చరణ్, కృష్ణుడిగా తానే నటించబోతున్నట్లు సమాచారం. భీముడిగా సల్మాన్ ఖాన్, ద్రౌపదిగా దీపికా పదుకొణె, అభిమన్యుడిగా విజయ్ దేవరకొండ, భీష్ముడిగా రజినీకాంత్, దుర్యోధనుడిగా అజయ్ దేవగన్ వంటి స్టార్ క్యాస్టింగ్‌పై చర్చలు సాగుతున్నాయి. ఈ భారీ మల్టీ-స్టారర్ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు ఈ ఏడాది రెండో సగంలో ప్రారంభం కానుండగా, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.