Allu Arjun : అల్లు అర్జున్ ‘నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా’ వీడియో వైరల్!
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకమైన స్టైల్, ఫ్యాషన్ తో ఎప్పుడూ అభిమానులను ఆకట్టుకుంటారు. తాజాగా ఆయన ‘నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా’ అని రాసున్న టీ-షర్ట్ తో కనిపించగా, అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ట్రెండ్ పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి మొదలై టాలీవుడ్ మొత్తానికి విస్తరించింది. అల్లు అర్జున్ ముంబైలోని ‘వేవ్స్ సమ్మిట్’ నుండి తిరిగి వస్తూ ఈ టీ-షర్ట్ లో కనిపించాడు. దీంతో సోషల్ మీడియా మీమ్స్ ను ఆయన ఎంత ఫాలో అవుతారో నెటిజెన్స్ చెబుతున్నారు. ఇకపోతే, ‘పుష్ప 2’ తో ప్రపంచ స్థాయి విజయాన్ని సాధించిన అల్లు అర్జున్, తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు అట్లీతో చేయబోతున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, అనన్య పాండేలు హీరోయిన్స్ గా నటించనున్నారు. ఈ ఏడాదిలోనే సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని టాక్.
View this post on Instagram