Amaravati Files Trailer : ‘అమరావతి ఫైల్స్’ ట్రైలర్ కి రికార్డు స్థాయి వ్యూస్..24 గంటల్లో అన్నీ రికార్డ్స్ అవుట్!

Amaravati Files Trailer
Amaravati Files Trailer : ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల హోరు మొదలైంది. రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాలతో వాళ్ళు ఎన్నికల రణరంగం లోకి దూకేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్ ‘సిద్ధం’ పేరుతో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. మరో పక్క నారా చంద్రబాబు నాయుడు ‘రా కదలిరా’ కార్యక్రమంతో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయయాత్ర’ కూడా ప్రారంభం కానుంది.
ఇలా వరుసగా రాజకీయ నాయకులూ ఎన్నికల వేడి పుట్టిస్తున్నారు. అయితే వీళ్లకు సపోర్టుగా నిలిచే కొందరు ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళు తమకి ఇష్టమైన రాజకీయ పార్టీలకు అనూకూలంగా కొన్ని సినిమాలను తీసి విడుదల చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో సీఎం జగన్ రాజకీయ ప్రయాణం ని గొప్పగా చూపించిన ‘యాత్ర 2 ‘ విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇక చంద్రబాబు నాయుడు కి అనుకూలంగా ‘అమరావతి ఫైల్స్’ అనే సినిమా కూడా అతి త్వరలో విడుదల కాబోతుంది. సీనియర్ హీరో వినోద్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని నిన్న విడుదల చేసారు. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. గత మూడేళ్ళ నుండి అమరావతి ప్రాంతం లో భూములు ఇచ్చిన రైతులు ఎంత కష్టం పడుతున్నారో వివరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ట్రైలర్ ని చూస్తున్నంతసేపు జరిగిన విషయాలనే చూపించారు అని అనిపించింది.
‘యాత్ర 2’, ‘వ్యూహం’ వంటి సినిమాలు ఒక వ్యక్తికీ లాభం చేకూర్చేలా ఉండే సినిమాలని, కానీ ‘అమరావతి ఫైల్స్’ జనాల ఇక్కట్లు ని కళ్ళకు కట్టినట్టు చూపించినట్టుగా అనిపించింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ కి 24 గంటల్లో 75 లక్షల వ్యూస్ వచ్చాయి. ఒక పొలిటికల్ మూవీ ట్రైలర్ కి ఈ రేంజ్ రెస్పాన్స్ స్టార్ హీరోల సినిమాలకు కాకుండా ‘అమరావతి ఫైల్స్’ కి మాత్రమే వచ్చిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. దీనిని బట్టి ప్రభుత్వం పై జనాలు ఏ రేంజ్ వ్యతిరేకత చూపిస్తున్నారో అర్థం అవుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు.