Anchor Suma Son : పోలీసుల రైడింగ్ లో దొరికిపోయిన యాంకర్ సుమ కొడుకు.. డిక్కీలో సూట్ కేసులతో అడ్డంగా బుక్ అయ్యాడుగా.. 

Anchor Suma Son

Anchor Suma Son Caught by Police Raid

Anchor Suma Son : టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల గురించి అందరికి తెలుసు.. ఈ భామ ఇప్పుడు తన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సిద్ధం అయ్యింది. ఇప్పటికే సుమ కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఇతడి మొదటి సినిమా రిలీజ్ కు రెడీగా ఉన్న సమయంలో సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల పోలీసుల రైడింగ్ లో దొరికి పోయాడు.

ఈ న్యూస్ ఇప్పుడు అందరికి షాకింగ్ గా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే మొత్తం స్టోరీలోకి వెళ్లాల్సిందే.. సుమ కుమారుడు రోషన్ స్నేహితులతో పాటు కారులో వెళుతుండగా పోలీసులు ఆపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు మద్యం, డబ్బులు చేతులు మారకుండా అన్ని వాహనాలకు చెక్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే రోషన్ కారును కూడా చెక్ చేసారు. రోషన్ తో పాటు అతడి స్నేహితులు కూడా పోలీసులు అడిగిన వాటికీ తిక్కతిక్కగా సమాధానాలు చెప్పి తమ ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించి ఎస్కెప్ అవ్వాలని చూసారు. కానీ పోలీసులు వదలకుండా వారి కారును కూడా చెక్ చేయడానికి డిక్కీ ఓపెన్ చేసారు.

కారు డిక్కీలో సూటుకేసులు కనిపించాయి.. వాటిని ఓపెన్ చేయమంటే ముందు వెనుక ఆడారు.. దీంతో పోలీసులతో డీల్ మాట్లాడుకునే ప్రయత్నాలు కూడా చేసిన పోలీసులు మాత్రం వదలకుండా సూట్ కేసులు ఓపెన్ చేయించారు. ఇందులో ఉన్న సరుకు చూసి పోలీసులు షాక్ అయ్యారు.

ఆ సూట్ కేసులలో జిలెబీలు, బబుల్ గమ్స్ ఉన్నాయి.. అర్ధమైంది కదా ఇది నిజమైన రైడ్ కాదని.. రోషన్ నటిస్తున్న మొదటి సినిమా ”బాబుల్ గమ్” డిసెంబర్ 29న రిలీజ్ అవ్వనుంది.. ఈ సినిమా ప్రమోషన్స్ నేపథ్యంలో రోషన్ తన టీమ్ తో కలిసి ఇలా వెరైటీగా ప్రమోషన్స్ చేసాడు.. మొత్తానికి ప్రమోషన్స్ తో హైప్ తేవడానికి నానా కష్టం పడుతున్నాడు..