Earthquake : పాకిస్థాన్‌లో మళ్లీ భూకంపం – ఈసారి ఎక్కడంటే?

Earthquake : మే 12, సోమవారం మధ్యాహ్నం 1:26 గంటలకు పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రాంతంలో 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో నమోదైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాణ, ఆస్తి నష్టం లేదు. ఇది గత నాలుగు రోజులలో నమోదైన రెండవ భూకంపం కావడం గమనార్హం.

పాకిస్థాన్‌ యురేషియన్‌, ఇండియన్‌ ప్లేట్‌ల సంగమ ప్రాంతంలో ఉండటంతో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2024లో ఇప్పటివరకు 167 భూకంపాలు నమోదయ్యాయి. బలూచిస్థాన్‌లో భూకంప నిరోధక నిర్మాణాలు, అవగాహన కార్యక్రమాలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

TAGS