Balayya 109 Movie : ‘బాలయ్య 109’లో ఆ యంగ్ హీరో.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

Balayya 109 Movie
Balayya 109 Movie : నందమూరి నటసింహ బాలకృష్ణ ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఈ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా దసరా కానుకగా రిలీజ్ అయ్యింది.. బాలయ్య హీరోగా కాజల్ హీరోయిన్ గా శ్రీలీల బాలయ్య కూతురుగా నటించిన ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ సినిమా అలా రిలీజ్ అయ్యిందో లేదో వెంటనే తన నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసాడు.. బాలయ్య తన నెక్స్ట్ సినిమాను బాబీ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాను ఎప్పుడో అఫిషియల్ గా ప్రకటించారు. ఇక భగవంత్ కేసరి రిలీజ్ కాగానే ఈ సినిమా షూట్ ను స్టార్ట్ చేసారు.
షూట్ స్టార్ట్ రోజే బాబీ పవర్ఫుల్ మాస్ పోస్టర్ ను రిలీజ్ చేసి ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పకనే చెప్పాడు.. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ వెంటనే బాలకృష్ణను నెక్స్ట్ సినిమా కోసం ఒప్పించాడు. ఈ సినిమా మంచి హైప్ తో షూట్ స్టార్ట్ చేసుకోగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో మరో యంగ్ హీరో నటించబోతున్నట్టు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టు టాక్ గట్టిగ వినిపిస్తుంది.. మరి ఈ రూమర్స్ పై మేకర్స్ అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.. అప్పటి వరకు ఇది రూమర్ గానే గమనించాలి..
