Bhashyam Praveen : చిగురుపాడు గ్రామంలో వెంకటేశ్వరస్వామి వ్రతంలో పాల్గొన్న భాష్యం ప్రవీణ్

Bhashyam Praveen
Bhashyam Praveen : అచ్చంపేట మండలం చిగురుపాడు గ్రామంలో  తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎనుముల చిన్న శేషయ్య నివాసంలో నిర్వహించిన వెంకటేశ్వరస్వామి వ్రతంలో  పెదకూరపాడు నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. చిన్న శేషయ్య ఆహ్వానం మేరకు వెళ్లి వెంకటేశ్వర స్వామి వ్రతంలో పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

ఈ సందర్భంగా చిగురుపాడు గ్రామానికి చెందిన టిడిపి, జనసేన, బిజెపి నాయకులతో మాట్టాడారు. తన గెలుపు కోసం శాయశక్తులా కృషి చేయాలని సూచించారు. ఇంటింటికి వెళ్లి తమ పథకాల గురించి వివరించి భారీ మెజారిటీ సాధించేందుకు పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

 TAGS  AP Elections 2024Bhashyam PraveenChigurupaduMLA candidate Bhashyam PraveenPedakurapaduTDPTDP Janasena BJP VS YCPTDP Leader Vratham
