Bhashyam Praveen : ముస్లిం పాడె మోసిన పెదకూరపాడు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్

Bhashyam Praveen
Bhashyam Praveen : పెదకూరపాడు నియోజకవర్గంలో చనిపోయిన ఓ ముస్లిం పాడెను తెలుగుదేశం, జనసేన, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మోశారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ముస్లం వ్యక్తి మృతి చెందిన విషయం భాష్యం ప్రవీణ్ కు తెలిసింది. వెంటనే ఆయన ఆ ముస్లిం వ్యక్తి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి బాసటగా నిలిచారు. శవ యాత్రలో ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పాల్గొని పాడె మోశారు. పెద్ద మనసుతో ముస్లిం పాడె మోసిన భాష్యం ప్రవీణ్ ను పలువురు నాయకులు, ముస్లిం పెద్దలు, గ్రామస్థులు అభినందించారు. ఇలాంటి నాయకులే ఎన్నికల్లో గెలిస్తే ప్రజాసేవలో ముందుంటారని, భాష్యం ప్రవీణ్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవాలని ఆకాంక్షించారు.
 TAGS  Bhashyam PraveenBhashyam Praveen CampaignBhashyam Praveen Today SchedulePedakurapaduPedakurapadu Public Pulse
