Bhasyam Praveen Campaign : తాడువాయి గ్రామంలో టీడీపీలో చేరిన 16 వైసీపీ కుటుంబాలు

Bhasyam Praveen Campaign
Bhasyam Praveen Campaign : ఈరోజు అచ్చంపేట మండలం తాడువాయి గ్రామ వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ఉప సర్పంచ్ కస్తాల బాలస్వామి, వేమవరపు ఆదం, మాజీ సర్పంచ్ అనుముల వెంకట్రావు, కండెల రవి, మల్లెల చిన్ని మరియు 16 కుటుంబాలు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఆహ్వానించారు.
ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ ఎన్డీయే కూటమి అభ్యర్థుల విజయం కోసం అందరూ కృషి చేయాలని అన్నారు. ప్రజలకు మేనిఫెస్టో గురించి వివరించాలని టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. మే 13న ఆలోచించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.