NRI : అమెరికాలో ఉంటున్న ఎన్నారైలకు బిగ్ షాక్
NRI : అమెరికా ప్రభుత్వం విదేశాలకు నగదు బదిలీలపై 5% పన్ను విధించే ‘‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’’ను ప్రతిపాదించింది. అయితే ప్రతినిధుల సభ బడ్జెట్ కమిటీ ప్రస్తుతం ఈ బిల్లును తిరస్కరించింది. దీనిపై సవరణలు చేసి మళ్లీ ప్రవేశపెట్టనున్నట్లు స్పీకర్ మైక్ జాన్సన్ తెలిపారు. బిల్లు అమలైతే, హెచ్-1బీ, ఎఫ్-1, జే-1 వీసాదారులు సహా పౌరసత్వం లేని విదేశీయులు అమెరికా నుంచి స్వదేశాలకు నగదు పంపితే 5% పన్ను చెల్లించాలి. ఈ నిర్ణయం అమలైతే, అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులపై, భారత రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది. 2023–24లో భారత్‌కు వచ్చిన మొత్తం రిమిటెన్సుల్లో 28% డాలర్లు అమెరికా నుంచే వచ్చాయి. 5% పన్నుతో ఈ పంపకాలు తగ్గే అవకాశముంది, దీని వల్ల భారత ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా హౌసింగ్ పెట్టుబడులపై ప్రభావం కనిపించనుంది.