Bigg Boss 7 This Week : బిగ్ బాస్ 7 ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే.. ఆ ఇద్దరు ఎవరంటే?

Bigg Boss 7 This Week
Bigg Boss 7 This Week : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతున్న నేపథ్యంలో ప్రతీ వారం ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు. ఇప్పటికే స్టార్ట్ అయ్యి 10 వారాలు ముగిసి 11వ వారంలోకి అడుగు పెట్టింది. గత వారంలో భోలే ఎలిమినేట్ అయ్యాడు.. మరి ఈ వారం కూడా నామినేషన్స్ రసవత్తరంగా సాగాయి..
ఈ వారం హౌస్ లో ఉన్న 10 మందిలో శివాజీ, ప్రశాంత్ మినహా మిగిలిన 8 మంది నామినేషన్స్ ఉన్నారు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అంత ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి ముగింపు కూడా అయ్యింది.. మరి ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు? ఎలిమినేట్ కాబోయేది ఎవరు అనేది తెలుసుకుందాం..

Rathika Rose and Shoba Shetty
ప్రస్తుతం హౌస్ లో 10 మంది ఉండగా ఆడియెన్స్ మాత్రం రతికా రోజ్, శోభా శెట్టి, అశ్విని ఎలిమినేట్ కావాలని గత కొంత కాలంగా చూస్తున్నారు. కానీ బిగ్ బాస్ మాత్రం ఓటింగ్ విషయంలో వీరు లాస్ట్ లో ఉన్న వీరిని కాపాడుతూ వస్తున్నాడు.. మరి ముఖ్యంగా రతికా రోజ్, శోభా రెచ్చిపోతున్న కూడా వీరిని కాపాడుకుంటూ వస్తున్నాడు బిగ్ బాస్..
ఈ వారం కూడా ఓటింగ్ పరంగా చూసుకుంటే.. యావర్ 34 శాతం ఓట్లతో టాప్ లో ఉన్నాడు.. ఇక తర్వాత 19 శాతం ఓట్లతో రెండవ స్థానంలో అమర్ ఉన్నాడు.. 3వ స్థానంలో గౌతమ్, అశ్వినికి 8 శాతం ఓట్లతో 4వ స్థానంలో ఉంది.. అలాగే ప్రియాంక 7 శాతం ఓట్లతో 5వ స్థానంలో అర్జున్ 6.5 శాతం ఓట్లతో 6వ స్థానంలో ఉన్నాడు. ఇక లాస్ట్ రెండు స్థానాల్లో శోభా, రతికా ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.
 TAGS  Bigg Boss 7 This WeekBigg Boss 7 This Week NominationsBigg Boss Telugu 7Rathika RoseShobha Shetty
