RTC strike : తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన చర్చలు సఫలం కావడంతో కార్మిక నేతలు ఈ నిర్ణయం తీసకున్నారు. అంతకుముందు సీపీఐ నేత కూనంనేని, ఎమ్మెల్సీ కోదండరాం నేతృత్వంలో ఆర్టీసీ జేఏసీ, కార్మిక సంఘాలు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు సీఎంతో చర్చించి కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని సమ్మె ఆలోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేసిన ప్రభుత్వ పెద్దలకు కార్మికులు తలొగ్గారు. ఆర్టీసీ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికీ తీసుకుపోయి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రులు హామీఇచ్చారు. ప్రజా శ్రేయస్సు దృశ్య, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ
సమ్మె ఆలోచనపై విరమించుకోవాలని విజ్ఞప్తి చేయడంతో సమ్మెత విరమించారు