Diwali gift : కంపెనీ ఉద్యోగులకు దీపావళి కానుకగా కార్లు..

Diwali gift
Diwali gift : కొవిడ్ తర్వాత నుంచి కంపెనీల తీరు చాలా వరకు మారిపోయింది. ఉద్యోగులను తగ్గించుకోవడం, జీతాల్లో కోత విధించడం, ఉన్న జీతం కూడా సరైన సమయానికి ఇవ్వకపోవడం, పని గంటలు పెంచడం ఇలా ప్రతీ ఒక్కటీ సాధారణ ఎంప్లాయ్ కి ఇబ్బంది కలిగేలా కంపెనీ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. కానీ ఒక కంపెనీ యజమాని వారి సిబ్బందికి కార్లను బహుమతిగా ఇచ్చాడు. వాటిని దీపావళి గిఫ్ట్ గా ఇచ్చాడు. పంచకులలోని మిట్స్ హెల్త్‌కేర్ యజమాని MK భాటియా తన కంపెనీలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు 15 కార్లను బహుమతిగా ఇచ్చారు. 13 టాటా పంచ్, 2 మారుతి గ్రాండ్ విటారా వాహనాలు ఉన్నాయి. భాటియా ఇప్పుడే కాదు.. గతేడాది కూడా 12 కార్లను ఇచ్చాడు. ఇది ప్రోత్సాహంగానే ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్లను కంపెనీ పేరుపై రిజిస్ట్రర్ చేయగా.. అధికారిక పని కోసం ఇంధన ఖర్చును కూడా కంపెనీనే భరిస్తుందని చెప్పడం కొసమెరుపు. వచ్చే ఏడాది 50 కార్లను బహుమతిగా ఇవ్వాలనే ప్రణాళికతో ఉన్నారని చెప్పారు.
View this post on Instagram