Mahanadu Speech : చంద్రబాబు మహానాడు ప్రసంగం – ముఖ్యాంశాలు
Mahanadu Speech : ఆంధ్రప్రదేశ్ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కడపలో ప్రారంభమైన మహానాడులో ప్రసంగించారు. ఇది చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు.
కడపలో మొదటిసారి మహానాడు నిర్వహిస్తున్నామని, ఇది పార్టీ దిశా నిర్దేశం చేస్తుందని చెప్పారు.
2024 ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్ సాధించామన్నారు. ఇది కార్యకర్తల అంకితభావానికి ఫలమని పేర్కొన్నారు.
పార్టీ కార్యకర్త చంద్రయ్య “పీక కోస్తున్నా జై తెలుగుదేశం” అన్నాడని, ఆయన త్యాగం స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
తెలుగుదేశం ఒక బ్రాండ్, అది నీతి, నిజాయితీతో రాజకీయాలు చేస్తుందన్నారు.
సంక్షేమం, అభివృద్ధికి తెదేపా ట్రెండ్ సెట్టర్ అని అభిప్రాయపడ్డారు.
అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20 వేల సహాయం,
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం,
5 ఇన్నోవేషన్ హబ్‌లు ప్రారంభం వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించారు.
*పీక కోస్తున్నా జై తెలుగుదేశం అన్నాడు.. చంద్రబాబు చెప్పిన చంద్రయ్య కథ*
తెలుగుదేశం పార్టీకి నిరంతరంగా నిబద్ధత చూపిన కార్యకర్తలను ప్రశంసిస్తూ, పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ—”వైకాపా విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేశారు, కానీ తెదేపా కార్యకర్తలు పోరాటాన్ని ఆపలేదు. మన కార్యకర్త చంద్రయ్య పీక కోస్తున్నా కూడా ప్రాణాలు విడిచే క్షణంలో కూడా ‘జై తెలుగుదేశం’ అన్నాడు.
అదే మన స్ఫూర్తి, అదే మన బలం,” అన్నారు. 43 ఏళ్ల పార్టీ ప్రస్థానం ఎంతో మంది త్యాగాలతో నిండి ఉందని, అలాంటి అంకితభావమే తెదేపా విజయానికి మూలమని ఆయన అన్నారు.