Chandramohan Comments : చిరు కెరీర్ ను ఇలా తీర్చిదిద్దింది అల్లు అరవిందే.. చంద్రమోహన్ ఏమన్నారంటే?

Chandramohan Comments

Chandramohan Comments

Chandramohan Comments on Chiru Career : టాలీవుడ్ లో ఎందరో సీనియర్ నటులు ఉన్నారు. వారిలో చంద్రమోహన్ ఒకరు.. సీనియర్ నటుడు, కథానాయకుడు చంద్రమోహన్ ఈ రోజు తుది శ్వాస విడిచారు.. ఈ మధ్య మన టాలీవుడ్ లో వరుసగా విషాద ఛాయలు అలముకున్నాయి.. ఎవరో ఒకరి మరణ వార్త అందరికి షాక్ ఇస్తుంది.. ఇప్పటికే ఈ ఏడాది ఎంతో మంది మరణించడం టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటుగా మిగిలిపోయింది.

తాజాగా ఈ టాలెంటెడ్ నటుడు కూడా మరణించడం అందరిని శోకసంద్రంలో మునిగేలా చేసింది. 82 సంవత్సరాల చంద్రమోహన్ ఈ రోజు ఉదయం అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఇక ఈయన అంత్యక్రియలు సోమవారం రోజు హైదరాబాద్ లో జరగనున్నట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉండగా ఈయన మరణంతో ఈయన గురించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 900 లకు పైగానే చిత్రాల్లో నటించిన అనుభవం ఆయనకు ఉంది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా తెలుగు సినీ పరిశ్రమలో రాణించాడు.. అయితే ఈయన కొంత కాలంగా అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నాడు.

దీంతో చంద్రమోహన్ ఎక్కువుగా సినిమాల్లో కనిపించడం లేదు. ఈయన కెరీర్ లో చంద్రమోహన్ కు సంబంధించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చంద్రమోహన్ అప్పటి అనుభవాలను గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పగా ఆ మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.. అప్పట్లో చిరంజీవి కంటే నేను చాలా సీనియర్.. ప్రాణం ఖరీదు చిత్రానికి చిరంజీవికి 5 వేలు ఇస్తే నాకు 25 వేలు ఇచ్చారు.. చిరంజీవిని అర్జునుడిగా.. అల్లు అరవింద్ ను కృష్ణుడిగా పోలుస్తాం..

సారధి లేకపోతే అర్జునుడు నథింగ్.. అర్జునుడికి సలహాలు ఇస్తూ నడిపించింది కృషుడు.. అలాగే చిరంజీవి విషయంలో కూడా అల్లు అరవింద్ బాగా ఉపయోగపడ్డారు.. ఎవరితో సినిమాలు చేయాలి.. ఎంత రెమ్యునరేషన్ అందుకోవాలి అనే విషయంలో చిరంజీవి గురించి డిసైడ్ చేసేది అల్లు అరవింద్ నే.. అదే చిరు కెరీర్ ను మార్చేసింది.. అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TAGS