Supreeth Reddy : డైరెక్టర్ గా మారిన ఛత్రపతి కాట్రాజ్..తొలి సినిమానే ఆ స్టార్ హీరోతో ఛాన్స్?

Chhatrapati Katraj who became a director
Supreeth Reddy : టాలీవుడ్ లో లీడింగ్ లో ఉన్న టాప్ మోస్ట్ విలన్స్ లో ఒకరు సుప్రీత్ రెడ్డి. ఈ పేరు చెప్తే మీరు గుర్తు పట్టలేకపోవచ్చు కానీ, ఛత్రపతి కాట్రాజ్ అంటే మాత్రం కచ్చితంగా గుర్తు పడుతారు. ‘ఛత్రపతి’ ఇచ్చిన ఫేమ్ తో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్లిన కాట్రాజ్, అతి తక్కువ సమయం లోనే మోస్ట్ వాంటెడ్ విలన్స్ లో ఒకరిగా మారిపోయాడు. కానీ ఈమధ్య కాలం లో సుప్రీత్ రెడ్డి పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు.
అడపాదడపా పలు సినిమాల్లో కనిపిస్తున్నాడు కానీ, అంతకు ముందు ఉన్న జోరు, దూకుడు కనిపించడం లేదు. ఆయనకి ఏమైనా అనారోగ్య సమస్య ఉందేమో, అందుకే సినిమాలు చెయ్యడం తగ్గించేసాడేమో అని అనుకొని ఉండొచ్చు. కానీ అతను సినిమాలకు దూరం గా ఉండడానికి కారణం అది కాదట. త్వరలోనే ఆయన ఒక దర్శకుడిగా మారాలి అనేదే లక్ష్యం అట, ఆ లక్ష్య సాధన కోసమే సినిమాలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది.
సినీ నటులు దర్శకులుగా మారి హిట్లు కొట్టడం కొత్తేమి కాదు, రీసెంట్ గానే జబర్దస్త్ కమెడియన్ వేణు ‘బలగం’ అనే చిత్రానికి దర్శకత్వం వహించి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే రేంజ్ బ్లూక్ బస్టర్ ని కొట్టాడు. ఇప్పుడు రీసెంట్ గా ధనరాజ్ కూడా ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. వీళ్ళ దారిలోనే ఇప్పుడు సుప్రీత్ కూడా నడుసున్నాడు. త్వరలోనే ఆయన యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు అట. రచయితగా, దర్శకుడిగా యూవీ క్రియేషన్స్ లాంటి టాప్ బ్యానర్ ని మెప్పించాడంటే సుప్రీత్ లో ఏ రేంజ్ టాలెంట్ ఉందో ఇప్పుడు అర్థం అయ్యింది. ఈ సినిమాలో న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించబోతున్నాడని టాక్.
రీసెంట్ గానే నాని ని కలిసి స్టోరీ ని వివరించగా , ఆయనకి తెగ నచ్చేసింది. వెంటనే ఈ సినిమా చేస్తున్నాం అని సుప్రీత్ కి చెప్పేశాడట నాని. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనుంది. నాని ఇలాంటి టాలెంట్ ని వెలికి తియ్యడం లో ఎప్పుడూ ముందు ఉంటాడు. ఇప్పటికే ఆయన బలగం డైరెక్టర్ వేణు తో ‘ఎల్లమ్మ’ అనే సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంతలోపే మరో కొత్తవాడికి ఛాన్స్ ఇవ్వడం అందరూ గమనించాల్సిన విషయం.