China-Pakistan : పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ముమ్మరంగా సాగుతున్న వేళ, పాకిస్తాన్ చైనా సాయంతో భారత్ పై భారీ కుట్రకు పాల్పడినట్లు రక్షణశాఖ అధ్యయనం వెల్లడి చేసింది. భారత రక్షణ స్థావరాలు, ఎయిర్ బేస్‌లకు సంబంధించిన కీలక సమాచారాన్ని చైనా ఉపగ్రహాల ద్వారా పాక్‌కు అందించిందని, వందల కొద్దీ డ్రోన్ల దాడులకు దారితీసిందని తెలుస్తోంది. కానీ చివరకు భారత ఎస్-400, ఎల్-70 వంటి రక్షణ వ్యవస్థల ధాటికి అవన్నీ విఫలమయ్యాయి. తైవాన్ వంటి దేశాల్లో ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నా, భారత్ ముందు పాక్-చైనా కుట్రలు సాగదీత అయ్యాయి.