Chiranjeevi Surekha : 43 ఏళ్ల కాపురంలో ఒక్కసారి కూడా సురేఖతో అలాంటి పని చేయని మెగాస్టార్!

Chiranjeevi Surekha
Chiranjeevi Surekha : నిరాడంబరత, నిలకడ, సహనం లాంటి అనేక క్వాలిటీస్ కు పేరు పెడితే అది మెగాస్టార్ చిరంజీవిగా మారుతుందనడంలో సందేహం లేదు. ఎలాంటి సెలబ్రెటీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి పద్మ విభూషణ్ వరకు ఆయన పయనం తారు రోడ్డు కాదు.. ఎన్నో ముళ్లబాటలను కూడా దాటుకుంటూ ఈ స్థాయికి ఎదిగారు. ఆయన పయనించిన బాట ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోలకు సదా ఆచరణీయం అని ఘంటాపథంగా చెప్పవచ్చు.

ఈ మధ్య చిరంజీవి తన దాంపత్య జీవితంలోని చిన్న చిన్న విషయాలను అప్పుడప్పుడు తన ఫ్యాన్స్ ముందుకు తీసుకస్తుంటాడు. అలా కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. చిరంజీవి తన వైవాహిక జీవితంలో సురేఖ పోషించిన పాత్రను చెప్తూనే ఉంటారు. ‘ముగ్గురు పిల్లలతో పాటు తనను చూసుకోవడంలో సురేఖ చాలా సహనంగా వ్యవహరించేదని, ఇంటి విషయాలను పెద్దగా తన వద్దకు తీసుకువచ్చేది కాదని, ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించేది. అందుకే నా ఫోకస్ ఎక్కువగా సినిమాలపైనే నిలపాను.’ అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు.

కూల్ పర్సన్ అయిన మెగాస్టార్ సినిమాకు ఎంత ప్రియారిటీ ఇస్తారో.. ఫ్యామిలీకి కూడా అంతే ప్రియారిటీ ఇస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘నేను పెళ్లి చేసుకొని 43 వసంతాలు గడిచింది. ఇన్నేళ్ల నా కాపురంలో ఒక్కసారి కూడా సురేఖతో దురుసుగా ప్రవర్తించింది లేదు.

ఒక్కసారి కూడా ఆమెపై చేయి ఎత్తింది లేదు. ఆమెకు సహనం, ఓర్పు ఎక్కవ. నన్ను తను అర్థం చేసుకున్నట్లుగా ఎవరూ చేసుకోలేరు. నా సక్సెస్‌కు కారణం ఆమే’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
