RTI office : ఆర్టీఐ ఆఫీస్ లో ప్రభుత్వ ఉద్యోగిపై కమిషనర్ల చిందులు

RTI office
RTI office : ఏపీ రాష్ట్ర ఆర్టీఐ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగిపై కమిషనర్లు చిందులుతొక్కారు. ఆర్టీఐ కమిషనర్లు ప్రతిరోజు కార్యాలయానికి వచ్చి సంతకం చేయాల్సి ఉంది. అయితే కమిషనర్లు ఎవరూ అలా చేయకపోవడంతో జీతాలు ఇవ్వలేదు. దీంతో వేతనాలు చెల్లించక పోవడంపై రాష్ట్ర సమాచార హక్కు చట్టం కార్యాలయానికి వారు వచ్చి ప్రభుత్వ సూపరింటెండెంట్ పై చిందులేశారు. ఉద్యోగి, ఆర్టీఐ కమిషనర్ల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం జరిగింది. రూల్స్ పాటిస్తున్నామని ఉద్యోగి చెప్తుంటే, వివక్ష చూపుతున్నారంటూ ఆర్టీఐ కమిషనర్లు విరుచుకుపడ్డారు. సమాచార కమిషనర్ల తీరుపై మిగతా ఉద్యోగులు మండిపడుతున్నారు.