Congress Job Calendar : కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్.. నిరుద్యోగుల ఓట్లే లక్ష్యంగా ప్రకటన

Congress Job Calendar

Congress Job Calendar

Congress Job Calendar : ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పై నిరుద్యోగులు విముఖతతో ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. రాష్ర్టం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియమాకాలపై అని పదే పదే చెప్పిన బీఆర్ఎస్, ఆచరణలో విస్మరించింది. స్వరాష్ర్టం ఏర్పడి పదేళ్లు గడిచినా ఒకే ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించింది. అది కూడా పరీక్షా పేపర్ల లీక్ లతో మూలన పడింది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై అంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. కాంగ్రెస్ ప్రకటించిన మ్యానిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ ప్రకటించింది.

నిజానికి తెలంగాణలో ఒక్కసారిగా వేవ్ మొత్తం మారిపోయింది. రేసులోకి అధికార పార్టీకి దీటుగా కాంగ్రెస్ వస్తున్నది. ఇక ఇప్పుడు ఆ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోపైనే చర్చంతా జరుగుతున్నది. యువత మొత్తం కాంగ్రెస్ వైపు చూసేలా ఏకంగా జాబ్ క్యాలెండర్ నే ఆ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ తమ బాధ్యతని నేరుగా కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది. ఇక ఇన్నాళ్లు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసిన నిరుద్యోగులంతా కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాంగ్రెస్ హయాంలోనే గతంలో నోటిఫికేషన్లు ఎక్కువగా వచ్చాయని నిరుద్యోగులు పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు.

Congress Job Calendar

Congress Job Calendar in Manifesto

ఇక ఎన్నికలకు ఏడాది ముందు బీఆర్ఎస్ నోటిఫికేషన్లు వేసినా, అవి కూడా లీక్ లతో అప్రతిష్టపాలయ్యాయి. ఇంత జరిగినా టీఎస్పీఎస్సీని ప్రభుత్వం ప్రక్షాళన చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది. నిరుద్యోగులను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ కు మంచి అవకాశం ఇప్పుడు వచ్చింది. ఇక ఆ అవకాశాన్ని వాడుకుంది. మ్యానిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగుల్లో ఆశలు నింపింది. ఇక నిరుద్యోగ యువత దృష్టి తనవైపు తిప్పుకుంది. ఇవి ఓట్లుగా మారితే ఇక కాంగ్రెస్ కు తిరుగుండదు.