
Constables wifes
Constables Wife Demands : పాత పద్ధతిలో లీవ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టెన్త్ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు గురువారం నేషనల్ హైవేపై ధర్నాకు దిగి బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది వరకు 15 రోజులకు ఒకసారి సెలవులు ఉండేవన్నారు. కానీ నవంబరు 1 నుంచి నెల రోజులకు ఒకసారి లీవ్ వచ్చేలా డిపార్ట్ మెంట్ వారు మాన్యువల్ రూపొందించారన్నారు. పాత పద్ధతిలోనే లీవ్స్ మంజూరు చేయాలని వారు డిమాండ్ చేస్తూ నిరశన వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని రోడ్డుపై బైఠాయించిన వారిని పక్కకు తప్పించి రాకపోకలను పునరుద్ధరించారు.