Daily horoscope:డిసెంబర్ 17 ఆదివారం..12 రాశుల ఫలితాలు ఇలా..

Daily horoscope:డిసెంబర్ 17 ఆదివారం. 12 రాశుల ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయి. ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ రాశి వారికి ఈ రోజు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఎంత సహనంగా ఉంటే జీవితంలో విజయం సాధిస్తారు.. ఏ రాశి వారు ఎలాంటి నియమాలు పాటించాలి. వంటి వివరాలు ఈ రోజు రాశి ఫలాల్లో చూద్దాం.

మీ ఆశయాలు నెరవేరే సమయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

దూర ప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు, విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలతో గందరగోళ పరిస్థితి ఉంటుంది. అనవసర ధనవ్యయం.

వ్యవహారాలలో ఆటంకాలు, వృధా ఖర్చులు. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు ఎక్కువవుతాయి. మానసిక అశాంతి పెరుగుతుంది. దాని వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది.

సన్నిహితుల నుంచి శుభ వర్తమానాలు అందుకుంటారు. అదనపు రాబడి ఉంటుంది. కాంగ్రాక్టులు పొందుతారు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాభివృద్ధి, ఉద్యోగాలలో ప్రోత్సాహం ఉంటుంది. అన్నీ శుభాలే ఉన్నాయి.

ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కీలక వ్యవహారాలలో ఆటంకాలు, వృథా ఖర్చులు అనుకోని ప్రయాణాలు, అప్పులు చేస్తారు. కఫష్టపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్యం, వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే ఉంటుంది.

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చుల వైపు మనసు మళ్లుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. శ్రీలక్ష్మీగణపతి ధ్యానం శుభాలను కలిగిస్తుంది.

అనుకున్న పనులు విజయవంతగా పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ఆస్తి లాభం. యత్నకార్యసిద్ధి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతమైన వాతావరణం ఉంటుంది.

కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు, ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఏర్పడతాయి. ఆలయాలు సందర్శిస్తారు.

దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. అందరిలోనూ గుర్తింపుని పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. ఆలయాల సందర్శనం శుభఫలితాలిస్తుంది.

కుటుంబంలో చికాకులు, చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. ఆరోగ్య సమస్యలు.

కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనుకోని విధంగా ధన లాభం పొందుతారు. ఆస్తి వివాధాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.
