Murali Nayak : 23 ఏళ్లు కూడా నిండని మురళీ నాయక్ దేశం కోసం ప్రాణం అర్పించిన వీరజవాన్. ఉగ్రవాదుల దాడుల్లో అమరుడైన అతను, పవన్ కళ్యాణ్‌కి గాఢమైన అభిమాని. చిన్నప్పటి నుంచే పవన్ సినిమాలు చూస్తూ పెరిగిన మురళీ, గత ఎన్నికలలో జనసేన జెండా పట్టుకొని రోడ్లపై తిరిగిన ఫొటోలు నేడు వైరల్ అవుతున్నాయి. తన అభిమాన హీరోని కలవాలని కలగన్న మురళీ, ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయాడు. అయితే మురళీ అంత్యక్రియలకు పవన్ కళ్యాణ్ స్వయంగా హాజరై “జయహో మురళీ నాయక్” అంటూ నివాళి అర్పించడం హృదయాన్ని కదిలిస్తోంది. మురళీ తండ్రి పవన్‌ను చూసి విలపించిన దృశ్యం నెటిజెన్ల కన్నీళ్లు పెట్టిస్తోంది. దేశం కోసం ప్రాణం కోల్పోయిన ఒక అభిమాని కోసం అతని హీరో రాలాడటం అనేది ఎంతో మందికి గౌరవంగా అనిపించింది.