Transfer Wrong Blood : తప్పుడు రక్తం ఎక్కించి రోగి ప్రాణాలు తీసిన డాక్టర్.. ట్రాన్స్ ఫర్ తో సరి

Transfer Wrong Blood

Transfer Wrong Blood

Transfer Wrong Blood  : వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జిజిహెచ్)లో 34 ఏళ్ల మహిళ మృతి చెందింది.
నవంబర్ 26న ఈ సంఘటన జరిగింది, ఒక హౌస్ సర్జన్ అవసరమైన ‘ఓ-పాజిటివ్’ గ్రూపుకు బదులుగా ‘AB పాజిటివ్’ బ్లడ్ గ్రూప్‌ను రోగికి ఎక్కించారు. దీంతో ఆమె మృతి చెందింది.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన   భావన శిరీష గత నాలుగేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఆమె అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

నవంబర్ 4న మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌లో చేర్పించారు. తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు ఉన్నందున GGH వైద్యులు ‘O పాజిటివ్’ గ్రూపు రక్తంతో రక్తాన్ని ఎక్కించాలని సూచించారు.

బంధువులు ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్‌కు అవసరమైన రక్త నమూనాలను అందించడంతో, నవంబర్ 26, మంగళవారం డ్యూటీలో ఉన్న హౌస్ సర్జన్ బ్యాంక్ నుండి రక్తాన్ని తీసుకువచ్చి మార్పిడి చేయడం ప్రారంభించారు.

మంగళవారం సాయంత్రం డ్యూటీలో ఉన్న హౌస్‌ సర్జన్‌  ప్యాకెట్‌లో ఏబీ పాజిటివ్‌గా ఉన్న బ్లడ్‌ గ్రూప్‌ను రోగికి పొరపాటున ఎక్కించాడు.  ప్రశ్నించిన బంధువులకు “నాకు తెలియదా…నాకు చెబుతున్నావా?” అని హెచ్చరించాడు.

కొద్దిసేపటికే రోగి పరిస్థితి విషమించి చనిపోయింది. కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి మాట్లాడుతూ.. హౌస్ సర్జన్ పొరపాటున రక్తాన్ని ఎక్కించారని ఇప్పటికిప్పుడు చెప్పలేమని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని.. విచారణ ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.  ఈ ఘటనపై వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం అందించింది. డాక్టర్ లావణ్య కుమారి బాధిత కుటుంబానికి ₹ 3 లక్షల పరిహారం చెక్కును అందజేసి, సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.  ఆ వైద్యుడిని కేవలం ట్రాన్స్ ఫర్ చేసి చేతులు దులుపుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.