Heroine Anita : ‘నువ్వు నేను’ హీరోయిన్ అనిత కి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..? చూస్తే ఆశ్చర్యపోతారు!

'Nuvu Nenu' heroine Anita Son

‘Nuvvu Nenu’ heroine Anita Son

Heroine Anita : కేవలం ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల్లో ఎప్పటికీ చెరిగిపోని స్థానం ని సంపాదించుకున్న హీరోయిన్లు మన టాలీవుడ్ లో చాలా తక్కువగా కనిపిస్తుంటారు. అసలు వీళ్లకు ఏమి తక్కువ అని ఇండస్ట్రీ కి దూరం అయ్యారు?, ఎందుకు అవకాశాలు రావడం లేదు అనే ప్రశ్నలు వీళ్ళకి సంబంధించిన సినిమాలు టీవీ లలో వచ్చినప్పుడు చూసి అనుకుంటూ ఉంటాం. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు అనిత.

తేజా దర్శకత్వం లో ఉదయ్ కిరణ్ హీరో గా నటించిన ‘నువ్వు నేను’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన అనిత, ఆ సినిమాతో ఏ రేంజ్ గుర్తింపు ని దక్కించుకుందో మన అందరికీ తెలిసిందే. అందం తో పాటు అద్భుతమైన నటన కనబర్చే పాత్రని ఆమె మొదటి సినిమాలోనే చేసింది. ఈ సినిమా చూసిన తర్వాత అనిత కి టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వచ్చాయి కానీ, సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేకపోవడం తో ఆమె టాలీవుడ్ లో అనుకున్న స్థాయికి చేరుకోలేకపోయింది.

ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ, తరుణ్ తో నటించిన ‘నిన్నే ఇష్టపడ్డాను’ సినిమా మినహా, మిగిలినవివ్వని ఆమెకి ఏ మాత్రం గుర్తింపుని తెచ్చిపెట్టని సినిమాలే చేసింది. ఎక్కువగా నెగటివ్ రోల్స్ లో కనిపిస్తూ వచ్చిన ఈమె, సినిమా అవకాశాలు తగ్గిపోవడం తో బాలీవుడ్ లో టీవీ సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ లేడీ విలన్ గా మంచి పేరు కూడా తెచ్చుకుంది. ఇకపోతే అనిత అసలు పేరు హస్సానందిని. ఈమె 2013 వ సంవత్సరం లో గోవా కి చెందిన బిజినెస్ మెన్ రోహిత్ ని పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాలకు హీరోయిన్స్ సాధారణంగా దూరం అవుతూ ఉంటారు. కానీ అనిత మాత్రం సినిమాలతో పాటుగా సీరియల్స్ కూడా కొనసాగిస్తూ వచ్చింది.

ఇకపోతే సోషల్ మీడియా లో తరచూ యాక్టీవ్ గా ఉంటూ వచ్చే అనిత, రీసెంట్ గా తనకి సంబంధించిన కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. ఈ ఫోటోలలో ఆమె తన కొడుకు తో కలిసి ఉన్న ఫోటోలను చూసి అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు. అనిత కి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా?, అసలు నమ్మశక్యం గా లేదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనిత కూడా తన కెరీర్ తొలినాళ్లలో కంటే ఇప్పుడే ఎంతో అందం గా ఉండడం విశేషం.

TAGS